భారత్, వెస్టిండీస్‌ల మధ్య గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. యువ సంచలనం శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో టీం ఇండియా ఆడుతున్న రెండో సిరీస్ ఇది. అది కూడా స్వదేశంలో జరుగుతోంది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టెస్ట్‌కి ముందు భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని సోషల్‌మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘‘జట్టు కాంబినేషన్‌పై మ్యాచ్ టు మ్యాచ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. గేమ్ ఎంతసూసే సాగుతుంది.. ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తుది జట్టును ఎంపిక చేస్తాము. కానీ, ముందుగా ఎలాంటి నిర్ణయము తీసుకోము’’ అని గిల్ తెలిపాడు.